Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

                   శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మాణ్య శాస్త్రి ప్రతిభాసంపన్నుడైన కవి. మూడు దశాబ్దుల పాటు అధ్యయన అధ్యాపనలు కొనసాగించిన ద్రోణాచార్యుడు. తాను పెరిగిన "నంద్యాల " చరిత్రను , మహిమాన్వితయైన చౌడేశ్వరదేవి విలాసాన్ని ప్రాచీన ప్రబంధ ధోరణిలో ఏకదాసస్వాస భరితంగా ఊహాకల్పన చేసిన యశస్వి.

                  పితృవాత్సల్యానికి దూరమై నందుడు నగరాన్ని విడిచాడు. తనంత తాను నంద సామ్రాజ్య స్థాపన చేశాడు. అతనికి సతనం కలుగలేదు అని చింతించాడు. ఇది ప్రధాన కథ.

                  కథాగమనంలో ఉత్కంఠభరిత సన్నివేశాలు కల్పన చేయడంలో శాస్త్రి సినిమాఫక్కిలో ముందుకు సాగాడు. నందమూరి తారక రామారావు నటించిన చారిత్రక చలనచిత్రం వలె స్ఫురించే ఘట్టాలను కల్పన చేశారు. వర్ణనావిలసితమై , ఇతివృత్తభరితమై, కావ్యలక్షణశోభితమై ఈ కావ్యం రాయలసీమలోని ప్రాచీనాధునిక కవి పరంపరలో శాస్త్రికి స్థానం చేకూర్చింది.