శాంతి నారాయణ ప్రపంచం తెలిసిన రచయిత. ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తుల్ని తెలిసిన రచయిత. ప్రపంచం మారాలన్న తపనతో రచనలు చేస్తున్న రచయిత. మారుతున్న ప్రపంచాన్ని గుర్తిస్తూ మారని ప్రపంచంలోని వాస్తవాలను లెక్కిస్తూ రచనలు చేస్తున్న రచయిత శాంతి నారాయణ. స్వతంత్ర్య భారతదేశంలో అస్వతంత్రంగా మిగిలిపోయిన పార్మ్వలను ప్రదర్శిస్తున్న రచయిత శాంతి. పాలకుల ప్రచారానికీ జీవితంలోని వాస్తవాలకూ ఎంత ఎడం ఉందో శాంతి నారాయణ సాహిత్యంలో చూడవచ్చు.
స్వతంత్ర భారతదేశంలో దళిత కూలీలు వేలం పాటల్లో భూస్వాములు పరం అవుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో పేద మహిళలు సారాయి అమ్ముకొని బతుకుతూ రాజ్యం చేతిలో బలైపోతున్నారు.
- డా. శాంతి నారాయణ