కొన్ని జీవితాలు కథల్లా ఉంటాయి. అలాగే, కొన్ని కథలు జీవితల్లా ఉంటాయి. అయితే కథలు జీవితాల నుంచే పుట్టుకొస్తాయి కానీ, కథల ప్రకారం జీవితాలు నడవవు. అందుకే కొన్ని జీవితాలు, కొన్ని కథలు... చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి.
సినీ నటి, రాజకీయ నాయిక జయలలిత జీవిత కథను వ్రాయాలని సంకల్పించినపుడు ఆమె జీవితంలో బయటికి కనిపించేది కొంత ఉంటె, కనిపించనిది ఎంతో ఉందనిపిస్తుంది. మనకు బయటకు కనిపించేదాన్ని బట్టి ఉహించవలసిన అవసరం కనిపిస్తుంది. ఎటొచ్చి ఆ ఊహ సామరస్యపూర్వకంగా అవగాహనా ఉండాలనిపిస్తుంది.
ఈ పుస్తకం ఉద్దేశం జయలలిత జీవితాన్ని, అంటే ఆమె సినిమాలు, ఆమె రాజకీయ ప్రస్థానం రెండిటినీ రేఖామాత్రంగా చూపించడం.
- ఇంద్రగంటి జానకీబాల