నా చిన్నతనం అంతా మా స్వగ్రామైన బాపట్ల లోనే గడిచి పోయింది!
పూర్వపు గుంటూరు జిల్లాలో తెనాలికీ చీరాలకు మధ్య నుండే సముద్ర తీరాన చల్లటి సముద్రపు గాలులతో కొబ్బరి చెట్లూ సర్వితోటలతో పంచదారలా తెల్లగా మెరిసిపోయే ఇసుకనేలతో, అప్పటి బాపట్ల ఒక ఋషివాటికను పోలివుండేది! అది ఒక నగరంలా కాకుండా పెద్ద గ్రామం లాగే వుండి, పసిపిల్లలు విధుల మధ్యలో కూడా నిర్భయంగా ఆడుకుంటూ ఇసుకలో పిచ్చుకగూళ్ళు కట్టి ఒకరినొకరు తరుముకుంటూ కిల కిలా నవ్వేస్తుంటే అలా నా బాల్యం అంతా ఒక మధుర కావ్యంలాగా గడిచిపోయింది!
- డా. వేదవ్యాస