నేను పుట్టినది భూస్వామ్య కుటుంబం. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలంలో కొత్తగూడెం అనే చిన్న గ్రామం. మా తండ్రి గారి పేరు రామిరెడ్డి, అమ్మపేరు చొక్కమ్మ, ఐదారువందల ఎకరాల భూస్వాములు.
1930-31 ప్రాంతాల్లో పుట్టినన్నేను. స్వరాజ్యం అని, నాకి పేరు మా అమ్మనే పెట్టుకున్నది. అవి స్వరాజ్యోద్యమం జరుగుతున్న దినాలు కదా! మా బంధువొకాయన, మా అమ్మకు మేనమామ కొడుకు - అయన కాంగ్రెస్ సభలకు పోతూండేటోడట. బంధువులు ఒకరిద్దరితోగాల్సి బొంబాయికి పోయి సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నడట . గాంధీని గురించి, జాతీయయోద్యమాన్ని గురించి అయాన ద్వారా వినడంతో ఆమెకు ఆ ఉద్యమం మీద అభిమానం కలిగిందట. నేను పుటిన ఇరవై రోజులకు అయన చూడ్డానికొచ్చిందట. అయన మాటమీదనే మా అమ్మ నాకు స్వరాజ్యం అని పేరు పెట్టుకున్నది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-విమల.
-కాత్యాయని.