సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన అటయాలాంగల్ అనే మలయాళ నవల అనువాదం ఈ నవల. మూల రచయిత సేతు. (1942 ) ప్రసిద్ధ మళయాల కాథ నవల రచయిత - ఒక డజనుకి పైగా నవలలు అర డజన్ కథా సంపుటాలు రచించారు - బ్యాంకులో చైర్మన్ కం ఎం.డి.గా పని చేసారు - "మానవ మనసుల అపారతాల్లో అంతు చిక్కకుండా స్థిర నివాసమేర్పరుచుకున్న వైయక్తిక వైఖరులను మానవ రక్తనాళాల్లో వ్యాపించి మంటగా మారె క్లిష్ట సమస్యలను బరువైన మాటలు శక్తీ ప్రవాహంతో గీసిన అపూర్వ ప్రతిభావంతుల్లో ఒకరు సేతు."
అనువాదం చేసిన ఎల్.ఆర్.స్వామి. మలయాళీ కనుక మలయాళం నుంచే అనువాదాం చేసారు. ఉద్యోగ రీత్యా విశాఖ స్థిరపడ్డాక తెలుగు బాషా, సాహిత్యం స్వయంగా నేర్చుకొని తెలుగులో కథా రచయితగా అనువాదకుడుగా ప్రసిద్దికెక్కారు - తెలుగులో 200 వందలకు పైగా కథలు వ్రాయాటమే కాక 14 పుస్తకాలు మలయాళం నుంచి తెలుగులోకి 10 పుస్తకాలు తెలుగు నుంచి మలయాళంలోకి అనువాదం చేసారు.