Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

         అప్పటి స్త్రీలు మగవారికి పరమ బానిసలనో, వారికసలు నోరు తెరిచే స్వాతంత్య్రం లేదని అనుకోవడం విన్నాను.

        స్త్రీకి ఇప్పటికంటే ఆ రోజుల్లోనే ఎక్కువ గౌరవం లభించేది. వివాహితురాలైన స్త్రీని ఎంతో గౌరవంగా చూసేవారు. స్త్రీల మాటకి కుటుంబంలో విలువ ఖచ్చితంగా ఉండేది. మగవాడి 'అహం' ఆ విషయాన్ని బయటకి చెప్పకపోయినా, నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం స్త్రీల సలహాల్ని పరిగణలోకి తీసుకునేవారు. ఇది నేను స్వయంగా చిన్నతనం నించీ గమనించిన మాట.

       ఆనాటినుంచి నేటివరకు జరిగిన అనేకానేక మార్పుల్ని అక్షర రూపంలో పెట్టాలనే నా ఆశే 'మూడో సీతగా' మారింది. వెయ్యేళ్ళలో లేని మార్పులు గత 65 సంవత్సరాల్లో జరిగాయి. కట్టెపొయ్యి నించి ఎలక్ట్రిక్ ఒవేన్ ల దాకా వచ్చిన మార్పులకి నేనే కాదు మిలోనూ ఎందరో సాక్షులం. మూడో సీత కల్పిత వ్యక్తి కాదు. కొంచెం అహం, కొంత పెంకితనం సీతకి పుట్టుకతో వచ్చిన గుణాలు. అద్భుతమైన గ్రాహక శక్తే కాదు, పరిసితులకి అనుగుణంగా తనని తాను మలుచుకోవడం భగవంతుడు ఆమెకిచ్చిన అపురూపమైన వరం.

                                                                                          - భువనచంద్ర