తెలుగు లో ముస్లిం రచయిత్రుల కథా సంకలనం వస్తోందని తెలిసి చాలా సంతోషించాను . అసలు సాహిత్య లోకంలోనే ముస్లిం రచయిత్రులు తక్కువగా ఉన్న వాస్తవానికి జవాబుగా తెలుగు ముస్లిం రచయిత్రులు కదలి రావటం కన్నా ఆనందదాయకం ఏముంటుంది?
స్త్రీల జీవితాలలో కథ వస్తవు ఉంటుందని, అందునా అతి సాధారణమైన ముస్లిం స్త్రీల జీవితాలలో ఆవిష్కరించవలసిన సత్యాలు ఉంటాయని చెప్పటానికి ఇలాంటి సంకలనాలు చాలా అవసరం. వీరిలో చాలామంది తొలిసారిగా కథలు రాశారని తెలిసి మరింత సొంతోషం కలిగింది. ముందు తరానికి చెందిన ఉర్దూ కథకురాలిగా ఈ యువ రచయిత్రులందరికి నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఈ రచయిత్రులందరి నుంచి మరెన్నో కథలు రావాలని, ఇలాంటి సంకలనాలు మరికొన్ని రావాలని కోరుకుంటున్నాను. ఈ కథలు ఉర్దూలోనే కాక ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే తెలుగు ముస్లిం జీవితం బయటివారికి తెలిసే అవకాశం ఉంటుంది.