Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

                                    "కరువు రక్కిసి కోరలు పీకటమంటే   ఏమిటయ్యా మోహన్ చెప్పు. కరువు లేకుండా చేసుకోవడం. అంటే ఎం చేయాలి? పంటలు  పండేలా చూసుకోవాలి. పంటలు పండటం అంటే రెగ్యులర్ గా  చేలకి నీళ్లు... అంటే నీటి సరఫరా మన చేతుల్లో వుండాలి. వాన మీద ఆధారపడకుండా ముఖ్యంగా చెరువులు, కాలువలు ప్రతి వూరు వచ్చేలా చూసుకోవాలి. అంటే మరి మన నదులకి అవసరమైన ప్రతిచోటా ఆనకట్టలు కట్టుకోవాలి. ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వేసినా పంచావర్షాలూ రావడం పోవడమే గని ప్రణాళికలు రూపుదిద్దుకోవడమనేది ఎరగం గదా! అదేమంటే ఫండ్సు  లేవు అనేది తారక మంత్రం కన్నా దివ్యంగా పలుకుతారు మన ప్రభుత్వాలు. మొన్న  ఏసియాడ్ కి 1600 కోట్లు ఖర్చు పెట్టారు. మన నాగార్జున సాగర్ కి   ఖర్చయిందేంతో తెలుసా 553  కోట్లు. అంటే ఏమన్నమాట? ఏసియాడ్ మానేస్తే మూడు నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టవచ్చు. వూహు మనకి ప్రాజక్టులుకన్నా ఆటలు, వాటి వల్ల వచ్చే గొప్పలు ముఖ్యం. అన్నంకన్నా  ఆకాశయానాలు, ఆర్యబట్ లు    అవశ్యం."