దక్షిణ ఎక్సప్రెస్ లయబద్దంగా శబ్దంచేస్తూ హైదరాబాద్ వెడుతుంది.
పేరుకు మాత్రమే ఎక్సప్రెస్ . వేగం మాత్రం మందంగా పెళ్ళికూతురు నడకలా ఉంది. ఇంద్రమోహన్ కళ్ళు విప్పి చుట్టూ కలయజూచాడు. త్రి టైర్ స్లీపర్ కోచిలో అందరు నిదురబోతున్నారు.
కొందరు ఖరీదయిన పరుపులు పరుచుకుంటే మరికొందరు దుప్పట్లు పరుచుకుని చేతిసంచో, తోలుపెట్టొ, చెయ్య తలక్రింద పెట్టుకుని నిదుర బోతున్నారు.
మూడో అంతస్తులో పడుకున్నాడు. ఇంద్రమోహన్ కి క్రింది సీటే దొరికింది. నాగపూర్ లో ఓ లావుపాటి స్త్రీ యెక్కింది. ఆమెను చుస్తే నీళ్ళగోలెం పై చెంబు బోర్లించినట్లు అనిపిస్తుంది.తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.