Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹25

                                ఆడపిల్లల భ్రూణహత్యలు/శిశుహత్యలు ప్రపంచంలోని అత్యంత దుర్మార్గమైన మారణకాండలతో సరితూగే విధంగా కొన్నిసార్లు అధిగమించే విధంగా కూడా పెరిగిపోయాయి. 0-6 మధ్యవయసు గల 15 లక్షల మంది బాలికలకు (గత 6 సం||ల కాలంలో) బతుకు నిరాకరించబడిందంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దానితో పాటుగా గత మూడేళ్లలో ఒక లక్ష ఆడ భ్రూణ శిశువులు లింగ నిర్ధారణ పరీక్షలకు గురై జన్మించకముందే హత్యకు గురయ్యాయి. పై వాస్తవాలు సమాజంలో స్త్రీల దుర్భరమైన పరిస్థితికి లింగవివక్షకు పితృస్వామ్యానికి గుర్తులు. దీని ఫలితం ఆడపిల్లలపై పుట్టిన తర్వాత పుట్టకముందు పెరుగుతున్న హింస...

                              0-6 మధ్య వయసుగల ప్రతి 1000 మంది మగ శిశువులకు 927 మంది ఆడశిశువులు మాత్రమే ఉన్నారన్న 2001 జనాభా లెక్కలు ప్రజల దృష్టిని ఈ సమస్య వైపుగా మళ్లించాయి. దీని అర్థం 2001 నాటికి ఈ మధ్యవయసు కలిగిన పిల్లలు మొత్తం 15.8 కోట్ల జనాభాలో 60 లక్షల మంది ఆడపిల్లల లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. దీనికి ప్రధానమైన కారణంగా అనేక రాష్ట్రాలలో ఆడపిల్లల భ్రూణ హత్యలు శిశు హత్యలు పెరిగిపోవడమనేదాన్ని గుర్తించారు. ఈ కారణంగానే ఈ సమస్య దేశవ్యాప్తంగా అనేకమంది నిపుణుల కార్యకర్తల చర్చల్లోకి వచ్చింది. పై నేరాలకు వ్యతిరేకంగాను, సమర్థిస్తూనూ అనేక వాదనలు కూడా ముందుకొచ్చాయి.

                              కర్ణాటకకు చెందిన మహిళా జాగృతి అనే సంస్థ ఈనాడు మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడుతున్నది. స్త్రీలపై హింస వ్యతిరేక కమిటీలో సభ్యసంఘమైన మహిళా జాగృతి కమిటీ పిలుపులో భాగంగా కూడా ఈ సమస్యపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నది. ఈ పుస్తకం తెలుగు అనువాదం సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకుని జాగృతమవ్వాల్సిన అవసరాన్ని గుర్తింపజేస్తుందని మహిళా మార్గం ప్రచురణలు భావిస్తున్నది.