Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹225

నేను ఈ పుస్తకాన్ని ఎందుకు రాసాను?

మిమ్మల్ని వేళాకోళం ఎవరైనా చేసారా...? మీరు తప్పు చేసారని నిరూపించడానికి ఎవరైనా ప్రయత్నించారా...? మిమ్మల్ని అపహాస్యం పాలు చేసారా...? మిమ్మల్ని అవమానించారా...? మిమ్మల్ని పడదోయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా ? అయినా మీరు నిలదొక్కుకుని అరిచారా . . .

ఇక చాలు, మరీ ఎక్కువ అయింది... తస్మాత్ జాగ్రత్త.........

నా జీవితంలో నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులలోనే చిక్కుకుపోయాను. ఇక సహించలేకపోయాను. చెలియలికట్ట తెగిపోయింది.... అందువలనే ఈ పుస్తకం రాసాను. మీకు అసలు సిసలైన నిజాలను చూపించాలి. నిజాలు తెలుసుకున్నాక మీ కళ్ళు తెరుచుకుంటాయని నా నమ్మకం..... తరతరాల నుండి వస్తున్న బిజినెస్లో మీరు ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతారు. వాటిల్లో లాభాలు తక్కువ వస్తున్నాయి. జీతాన్ని చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇక తమ ఆఫీసుల్లో పనిచేసే వర్కర్లను తీసేస్తున్నారు.

నేను తరతరాల నుండి వస్తున్న బిజినెస్ గురించి చెప్పాను. దీనికి వ్యతిరేకంగా మరో మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో నడిస్తే మీరు బాస్ కూడా కాగలుగుతారు. దీనిని అపరంపరాగత బిజినెస్ అని కూడా అనవచ్చును. ఈ బిజినెస్ ఈనాడు ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ కొత్త పద్ధతి ప్రజల కార్యప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు వాళ్ళ లైఫ్ స్టైలే మార్చేస్తోంది.

నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎమ్.ఎల్.ఎమ్) అన్న పేరున నడిచే ఈ వ్యాపారం. ఎంతో పై ఎత్తున మీరు మీ లక్ష్యం దాకా... పనిచేసే సమయం, ఎన్నిగంటల పని చేయాలి అన్న నిర్ణయం తీసుకోగలుగుతారు. పార్ట్ టైమ్ పనిచేస్తూ బోలెడంత సంపాదించవచ్చు. ఇదంతా ఉత్తి కల్పనేనా? లేకపోతే ఏదైనా స్కామా?.........