పౌరాణిక పాత్రల నేపథ్యంలో ఈ రచనని కొనసాగించినా, ఆసాంతం కల్పితసన్నివేశాలతో పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా తన సహజశైలి, చమత్కారాలతో శ్రీ కొవ్వలివారు భయంకర అనే కలం పేరుతో అత్యద్భుతంగా "మాయారంభ" ను పాఠకులకందరించారు.
మహేంద్రుని దేవసభలో మానవ గానంలో నిపుణులైన వారిని ఆహ్వానించి, అత్యుత్తమ ప్రతిభాశాలిని ఎంపిక చేసి, వారికీ "దేవవీణ" ను బహుకరించటాన్ని ప్రారంభసన్నివేశంగా ఈ నవల ప్రారంభమౌతుంది. ఆ సందర్భంగా నారదుల వారిని విస్మరించి తుంబురుల వారికే ఆ దేవవీణని బహుకరించటం వలన నారదుల వారికీ కలిగిన ఆగ్రహవామనాలు - వాటికీ రంభాదేవి కారకురాలని భావించి నారదుల వారు రంభాదేవి గర్వభంగానికి పన్నిన వ్యూహాలు - వాటిలో భాగంగా జరిగే సన్నివేశాలు - రంభా నలకూబరుల భూలోకపయనం, తదుపరి పరిణామాలు, ఈ నవలకి ప్రధాన ఇతివృత్తం.
-భయంకర్
(కొవ్వలి లక్ష్మీనరసింహారావు).