విజయేంద్ర వర్మ.
పాతిక సంవత్సరాల వయస్సున్న యువరాజు. త్వరలో తన రాజ్యానికి తండ్రికి వారసుడిగా మహారాజుగా పట్టాభిషిక్తుడు కావలసినవాడు. అయితే ఆరు నెలల క్రితం అయన తండ్రిగారు మహేంద్ర వర్మ రాజ్యం పొలిమేరల్లో సందర్శనకు వెళ్లి ఇక కనిపించకుండా పోయారు.
మహేంద్ర వర్మ గురించి కొడుకే కాకుండా, తమ్ముడు రుద్ర భూపతి, రాజ్య ప్రజలూ వెతుకుతూనే ఉన్నారు. మహేంద్ర వర్మ కనిపించలేదు. ప్రాణాలతో ఉండి వుంటే అయన ఈ పాటికే కనిపించి ఉండేవాడని కొంతమంది అభిప్రాయపడ్డారు.
తన తండ్రి ప్రాణాలతో ఉండి వుండడన్న ఆలోచనే ఆ రాజకుమారుడిని విపరీతంగా వేధిస్తోంది . దుఃఖం అతడిని విపశుడిని చేస్తోంది. తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు విజయేంద్ర వర్మ. తండ్రి లాలనలో తల్లి లేదన్న బెంగ అతడికి కలగలేదు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.