భారతదేశాన్ని పరిపాలించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తన గురువుకి రాసిన ఉత్తరంలో విషయం ఇలా ఉంది.
"నాకు అత్యవసరమని భావించి మీరు నాకు అరబ్బీ భాష నేర్పారు. దానివల్ల అటు మీకు, ఇటు నాకూ చాలా సంవత్సరాలు వృధా అయ్యాయి. . ఎదుగుతున్న లేత వయస్సులో విద్యార్థి బుద్దిని తేజోమయం చేయాలిగాని మీరు నన్ను మందబుద్ధిని చేశారు. జీవితంలో ఎక్కడా ఎందుకూ ఉపయోగపడని బాషా నేర్పడానికి మీరు నా జీవితంలోని విలువైన పది, పన్నెండేళ్ళు వృధా చేశారు. ఆ ఒక్క బాషా అందులోని సాంప్రదాయ రచనలు, అల్లాహ్ స్మరణ మాత్రామే నన్ను లోక జ్ఞానిగా , మేధో సంపన్నుడిగా చేస్తాయని మీరు ఎట్లా అనుకున్నారు? ఉపయోగపడే విద్యను పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. వారి అభిరుచికి తగినవిధంగా జ్ఞానాన్ని అందించాల్సి ఉంటుంది. కాగా, మీరు నా బాల్యాన్ని సర్వనాశనం చేశారు కదా?