ఫ్యూయర్ బాక్ పై అవగాహనను మర్క్స్ పదకొండు పాయింట్లుగా రాసిపెట్టుకొన్నాడు. తర్వాత విపులీకరించే ఉద్దేశంతో కావచ్చు. ఇది 1854 లో అప్పటికి మర్క్స్ వయసు ఇరవై ఏడేళ్లు. ఆ పదకొండు. అంశాలూ పందకొండు సిద్ధాంత సూత్రీకరణలు. ఫూయ్యర్ అంటే మర్క్స్ కి ఎంతో అభిమానముంది. అయితే ఫుయ్యర్ బాక్ భౌతికవాదానికున్న పరిమితుల్ని అర్థం చేసుకోడంలో మర్క్స్ కి ఆ అభిమానం అడ్డుపడలేదు. ఫుయ్యర్ బాక్ నైరూప్య మానవుని స్థానంలో మర్క్స్ కి నిజమైన మనిషిని, యాంత్రిక భౌతికవాదం నైరూప్య మానవుని స్థానంలో మర్క్స్ నిజమైన మనిషిని, యాంత్రిక భౌతిక వాదం స్థానంలో గతితార్కిక భౌతికవాదాన్ని నెలకొల్పాడు.
- రావు కృష్ణా రావు