Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ముందు మాటలు
ఇవి నక్సల్బరీ నిప్పురవ్వలు. ఇవి శ్రీకాకుళం విప్లవాగ్నులు, ఇవి పీడిత ప్రజల ఆరాటాల పాటలు. ఇవి విప్లవ యోధుల బలిదానాల బాటలు. ఇవి నాయకత్వపు వెలుతురు బావుటాలు. ఇవి విరసం దశాబ్దంలో
మంటల చేత మాట్లాడించి
రక్తం చేత రాగాలాపన చేయించిన మహాకవి శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' గీతాలు.
అయితే శ్రీశ్రీ అనగానే ఎవరికైనా సరే ముందు 'మహాప్రస్థానం' గుర్తుకొస్తుంది. అది సహజం. కాని 'మహా
స్థానం'తో ఆగిపోలేదు శ్రీశ్రీ. ముందుకి సాగిపోయాడు. ఆనాటి ప్రపంచ పరిస్థితులు, మన సమాజ స్థితిగతులు 'మహాప్రస్థానానికి నేపద్యం. శమైక జీవన సౌందర్యం' శ్రీశ్రీని ఆకర్షించింది. శ్రామిక లోకపు భావజాలం శ్రీశ్రీని అలరించింది. ఎంతో ముందుకి చూశాడు శ్రీశ్రీ. విప్లవాన్ని ఆహ్వానించాడు. అప్పటికింకా చెలరేగని పోరాటాల గురించి పలవరించాడు. చిక్కటి కవితలల్లాడు.
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు అంటూ పురికొల్పాడు. ఉద్యమానికి ఊతమిచ్చాడు.
అవిగో!
అవిరివిగో! అవిగవిగో! ఇంకిన, తెగిపోయిన, మరణించిన క్రొన్నెత్తురు! విపంచికలు! యువ యోధులు! వీరిని స్మరించాడు.
ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం! వినాలని పుబలాటపడ్డాడు.
అయితే 'మరో ప్రస్థానం' నాటికి విప్లవం మన ముంగిట్లో కొచ్చింది. ఉద్యమాలు విజృంభించాయి. పోరాటాలు చెలరేగాయి. 'మరో ప్రస్థానం' గీతాలు ఉద్యమంలోంచి వచ్చాయి. పోరాటాల్లోంచి పుట్టాయి. 'మహాప్రస్థానం'లో విప్లవాన్ని ఆహ్వానించిన శ్రీశ్రీ మరో ప్రస్థానం'లో విప్లవాన్ని రికార్డు చేశాడు. 'మహా ప్రస్థానం'లో యువ యోధులను మొత్తంగా స్మరించిన శ్రీశ్రీ 'మరో ప్రధానం'లో వారిని పేరు పేరు వరసనా పేర్కొన్నాడు.
కొల్లిపర, పంచాదీ
అల్లిపురం, సిమాద్రి చాగంటే, తామాడా
వెంపటాపు, కైలాసం వీళ్ళలాగా
యెర్రెర్రని రగతాల
యేరుల్లో యీదరా అని కర్తవ్య బోధ చేశాడు. ఉరి తీయబడ శిరసు' చెప్పిన రహస్యం వినాలని 'మహా ప్రస్థానం లో ఉబలాట పడ శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' నాటికి ఉరికంబం ఎక్కబోయే విప్లవకారులను ఒక ఏడాది ముందుగానే స్వయంగా కల్సుకున్నాడు.