వారు మన మధ్యే మసలుతారు. పలు రకాల వృత్తుల్లో జీవనయాత్ర సాగిస్తారు. అయితే ప్రవృత్తి రీత్యా మాత్రం వారు "సామెథింగ్ స్పెషల్". పైకి సాదాసీదాగా, మామూలు మనుషుల్లాగే కనిపించినా వారిలో అలౌకికమైన అసాధారణమైన ఉపజ్ఞ ద్యోతకమౌతూ వుంటుంది. లలితకళామూర్తులలో ఈ అతులిత ప్రజ్ఞ మెరుపుదిగవలె మిరమిట్లు గొల్పుతుంది. కవులు, రచయితులూ, సాహితీవేత్తలు, సంగీత కళానిధులూ, రంగస్థల దీధితులూ మనకోసం వేవేల వెల్గులను వెలార్చుతారు. మరికొందరు జనజీవన సామాజికరంగంలో కొనసాగి పరహితచరణమతులై పదుగురి కొరకు బ్రతుకుతారు.