Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

ఆల్కెమీ, వానమబ్బుల కాంతిఖడ్గం, టీ కప్పులో తుఫాను, తంగేటి జున్ను, Shades, The Twilight Zone కవిత్వ సంకలనాల తరువాత వస్తున్న ఏడవ కవితా సంపుటి ఇది. కవిత్వంలో కథల్లో గణాంకాలూ, పోలికలూ ఎక్కువైతే రసం తక్కువవుతుందని తెలిసీ, సమాచారాన్ని అందించే వాహకంగా నేను నా కవిత్వాన్నీ, కథల్నీ రూపొందించాను. అందుచేత అక్కడక్కడా రసభంగమైనా ఆ ఆటంకాల్ని సెల్ ఫోను రింగ్ టోన్లలా పరిగణించి మన్నించడం లాభదాయకం.

ఆధునికానంతర విచలిత స్వప్న కవిత్వంగా ఈ 'మరణశాసనం' కవితా సంపుటిని పేర్కొనడం కేవలం వివాద ప్రోద్దిత పదాడంబరమే కావచ్చు కాని పాక్షిక సత్యం కూడా! శాశ్వత సత్యం మరణమే అని తెలిసినా సత్యాన్వేషణ కొనసాగించడం జీవలక్షణం. స్వర్ణావరణపు మాయను తొలగించుకుని సత్య వదనాన్ని దర్శించడమే ఈ జంఝాటన ముఖ్యలక్ష్యం. మనుస్మృతిలో పేర్కొన్నట్లు

-“సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్  సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్” -
(సత్యాన్ని పలకాలి. ఇష్టమైన మాటలనే మాట్లాడాలి. సత్యమైనా సరే అయిష్టమైన వాటిని మాట్లాడవద్దు. ఇష్టంగా ఉన్నాయని అసత్యం పలుకవద్దు.)

.... అయినా సరే ప్రమాణం చేసి చెబుతున్నాను. అంతా నిజమే చెబుతాను.

                                                                                                                                                                                                                                                                 - డాక్టర్ లంకా శివరామప్రసాద్