అంబేడ్కరిజం పట్ల శత్రువులు ఉద్దేశ పూర్వకంగా అయోమయం సృష్టించారు. అందుకు అంబేడ్కర్ అనుచరులు తోడ్పడటం మన ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అంబేడ్కర్ అభిమానులపై అత్యాచారాలు పెరిగే కొద్దీ ఆ ప్రజలకు అంబేడ్కరిజంపై అభిమానం మరింత పెరుగుతుంది. వారి అభిమానాన్ని కొల్లగొట్టి దోచుకునేందుకు అధిపత్య శక్తులు మరింత అయోమయాన్ని సృష్టిస్తారు. అందువల్ల అంబేడ్కరిజాన్ని పునరుజ్జీవింపజేయాలనుకునే వారి మొదటి కర్తవ్యం ఈ అయోమయాన్ని చెల్లా చెదురు చేయడం. ప్రజలకు నిజమైన అంబేడ్కరిజం అర్థాన్ని వారు తెలియచెప్పగలగాలి. నిజమైన అంబేడ్కరిస్టులకు కుహనా అంబేడ్కరిస్టులకు తేడాను కూడా వారు చాటి చెప్పగలగాలి.
- మాన్యశ్రీ కాన్టీరాం