మంత్రము ఒక యోగము. మంత్రము ఒక ధ్యానము. మంత్రము ఒక ప్రజ్ఞానము. మంత్రము ఒక నియమము. మంత్రము ఒక సంయమము. మంత్రము మనో ప్రాణదృష్టులను పవిత్రీకృతము చేయటము మాత్రమే కాక చిత్త సుద్ధిని కలుగచేస్తుంది. అహంకార నాశనాన్ని కలుగచేస్తుంది. ఆ పిమ్మట ఆత్మ దర్శనానికి దారితీస్తుంది.
శ్వాస పీల్చే మనుష్యులకు మాత్రమే కాదు ప్రాణమువున్న ప్రతి జంతువుకి కూడ బ్రహ్మాన్ని చేరే హక్కు వుంది. పిపీలికాది బ్రహ్మపర్యంతము అని అనటానికి కారణము అది శ్వాస పీలుస్తున్నందున అది కూడ బ్రహ్మాన్ని చేరవచ్చు. బ్రహ్మము అన్న సంగతి తెలియకుండానే బ్రహ్మాన్ని చేరవచ్చు. అటువంటి బ్రహ్మ తత్త్వాన్ని తల్లీ నతని, కేవలాస్థితిని మనకి ప్రసాదించే గొప్ప సాధనాల్లో మంత్రము ఒకటి.
- డా. అరిపిరాల విశ్వం