Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రచురణ కర్తల మాట నరమేధానికి ఇరవై ఏళ్లు, చరిత్ర చెప్పిన సాక్ష్యాలు
గుజరాత్ మారణహోమం జరిగి ఇప్పటికి ఇరవయ్యేళ్లయింది. ఈ తరుణంలోనే సుప్రీం కోర్టు నరేంద్రమోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం లేదా గతంలో సిట్ ఇచ్చిందని నిర్ధారించడం విపరీత పరిణామం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీర్పును స్వాగతిస్తూ ఈ మారణహోమానికి అప్పటి ముఖ్యమంత్రి మోడీపై ఆరోపణలు అంతులేని బాధ కలిగించినా గరళకంఠుడిలా భరించారని పొగడ్తలుకురిపించారు. ఆ అమానుష హత్యాకాండ ప్రేరకులూ కారకులూ తర్వాత మరింత విస్తరించి అధికార పీఠాలధిష్టించారు. బాధితులు హాహాకారాలు ఇంకా వినిపిస్తుండగానే నిందితులూ, నేరస్థులూ మరింత విషపూరిత విద్వేషాలు నిత్యకృత్యంగా మార్చేశారు. 1992లో బాబరీ మసీదు విధ్వంసం, 2002లో గుజరాత్ మారణకాండ దేశచరిత్రలో మాసిపోని చీకటి ఘట్టాలు. 1984లో ఢిల్లీలో సిక్కులపై జరిగి హత్యాకాండను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. ఢిల్లీ హత్యాకాండలోనూ అయోధ్య ఘటనలలోనూ కొంతైనా విచారణ జరిగింది. కాని గుజరాత్ మారణహోమం మాత్రం అధికారిక విచారణకు నోచుకోలేదు. కొన్నిసార్లు బాధితుల ఫిర్యాదుపై విచారణ జరిగి శిక్షలు విధించినా అమలైంది నామమాత్రం! గోద్రా హత్యలకు ప్రతిచర్యగానే ఇది జరిగిందంటూ ఆ మారణకాండకే గోద్రా ఘటనలు అని పేరు పెట్టేశారు. ఎవరైనా వాటి గురించి మాట్లాడితే పాతగాయాలు గెలకవద్దని చెప్పడం, దురుద్దేశాలు ఆపాదించడం పరిపాటి అయింది. ఇప్పుడు అత్యున్నత...........