Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

ముందుమాట

భారతదేశ చరిత్రను తిరగరాస్తున్న జన్యుశాస్త్రం

ఈ భూమిమీద ఆధునిక మానవుడి కథ సుమారు రెండు లక్షల సంవత్సరాలకు ముందు ప్రారంభమైంది. చీకటి ఖండం అని పిలువబడ్డ ఆఫ్రికాలో తొలి మానవుడు వెలుగు చూశాడు. అక్కడినుండి ప్రయాణమై ఆఫ్రికా ఖండం బయటికి వచ్చాడు. అక్కడ నియాండర్ మ్యాన్ జాతితో లైంగిక సంపర్కం జరిగింది. సుమారు అరవై వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికా బయటి ప్రాంతాల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. మొదట మిడిల్ ఈస్ట్ చేరుకున్న మానవ సమూహాలు తర్వాత మధ్య ఆసియా ప్రాంతం చేరాయి. క్రమంగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఒక అంచనా ప్రకారం ఈ మానవ సమూహాలు తొలిసారిగా సుమారు నలభైవేల ఏళ్ళ క్రితం భారత భూభాగం చేరాయి. ఇవి రెండు శాఖలుగా విడిపోయాయి. ఉత్తర భారతదేశానికి పరిమితమైన వారు - ఉత్తర భారత పూర్వీకులు (Ancestral North Indians) అయ్యారు. దక్షిణ భారతదేశానికి పరిమితమైన వారు దక్షిణ భారత పూర్వీకులు (Ancestral South Indians) అయ్యారు. దక్షిణ భారత దేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో వలసలు ఎక్కువగా జరిగాయి. దక్షిణాన మూడు వైపులా సముద్రం ఉండడం మూలాన అక్కడికి వలసలు తగ్గి ఉండొచ్చు. అందుకే దక్షిణ భారతీయుల్ని మూలవాసులుగా పరిగణించారు.

ఈ దేశంలో క్రీ.పూ. 1500 నుండి క్రీ.శ. 200 మధ్య కాలంలో మనుస్మృతి- కుల వ్యవస్థను దృఢపరిచింది. అంతకు ముందు రెండువేల మూడు వందల ఏళ్ళు మిశ్రమ జనాభా (Exogamous) కొనసాగిన తరువాత, మనుస్మృతి ప్రభావంతో కులగోత్రాలు

ఆధారంగా (Endogamy) పెళ్ళిళ్ళు జరుగుతూ వచ్చాయి. మనుస్మృతి ప్రకారం శూద్రులు, క్షత్రియులు అంతా తక్కువవారే. కానీ, సామాజికంగా బలవంతులైన క్షత్రియులు

బ్రాహ్మణులకు గౌరవస్థానాలిచ్చి రాజ్యాలేలారు. రాజ్యాలేలిన ఇతర కులాలవారు కూడా చేసిన పనీ అదే. కొలోనియల్ రూలర్స్ కూడా దేశంలోని కుల వ్యవస్థను దెబ్బతీయకుండా తెలివిగా వారి పబ్బం గడుపుకున్నారు. భారతీయ సంప్రదాయ వాదులు చెప్పుకుంటున్నట్టు కులగోత్రాలకు ఆధారాలేవీ లేవు. అవి మధ్యలో కొన్ని సమూహాలు తమ ఆధిపత్యం