మనం..
నిరాశా నిస్మృహల వేడి నిట్టూర్పుల మధ్య ఒరిగిపోయినప్పుడు
మనల్ని ఓదార్చేది... ప్రేమ!
ఉర్డ్వేబాధల ఊబిలో కూరుకుపోయివున్న మన బ్రతుకులకు
చేయందించి పైకి లగేది... ప్రేమ!
మనో నిబ్బరాన్ని అధిగమించి కన్నీటికుండ బద్దలయినప్పుడు
మనల్ని లాలించేది ... ప్రేమ!
మనలో ఒదిగిపోయి మనల్ని జీవింపజేసేది ... ప్రేమ!
మనల్ని విరహంతో ముంచేది ప్రేమే-!
దుఖంలోకి దిగజార్చేది ప్రేమ!
ఆనందపు టంచుల్ని తాకించేది ప్రేమే-
మనల్ని కడదాకా నడిపించే కేలరీ ప్రేమ!
ప్రేమ బాధపడుతుంది.. బాధిస్తుంది..
అయినా... మనకు ప్రేమే ఊపిరి!