Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹99

హృదయాన్ని తాకి “మన కోనసీమ కథలు" గురించి...

కోనసీమ మాట్లాడింది. మనకు బోల్డన్ని కబుర్లు చెప్పింది. మనసును కదిలించింది... మనల్ని నవ్వించింది. మమకారాన్ని పంచింది.. డొక్కా సీతమ్మ గారిలా మనందరి సాహితీ ఆకలిని తీర్చింది.

కోడిపుంజులు, కొబ్బరి చెట్లు, కాలవగట్లు, కొయిలా కళ్ళజోళ్ళు, కల్మషం లేని మనుషులు, కాటన్ దొరగారు స్వచ్చమైన గోదారి... అందులో రహదారి పడవలు. మన తాతల కాలంనాటి ఇళ్ళు, గుళ్ళు... ఇలా ఎన్నో పాత్రలు, ప్రదేశాలు, ప్రముఖులు మనల్ని పలకరిస్తారు, మనతో స్నేహం చేస్తారు ఈ కోనసీమ కథల్లో...

గురుతుల్యులు, ఆప్తులు, సాహితీ ప్రియులైన శ్రీ దీపక్ రాజ్ గారు కోనసీమ అందాల్ని, సంస్కృతీ సాంప్రదాయాల్ని, చరిత్ర చెప్పిన ప్రముఖుల్ని... మనందరికి పరిచయం చేసారు.

“కౌశికలో ఇంద్ర ధనస్సు” కథలో వందల ఏళ్ళ చరిత్రవున్న పండగ... దాని సాంప్రదాయం మన కళ్ళముందు జరుగుతున్నట్టుంటుంది. “బండారు లంకలో టీ కొట్టు వీధి"లో వక్కలంక శోభన్ బాబుతో కలిసి మనం టీ త్రాగుతున్నట్లు అనిపిస్తుంది.

“సుబ్బరాజు గారి కోడిపుంజుకి అంత్య క్రియలు"కి వెళ్ళి రాజు గారిని మనం ఓదారుస్తాం. “పిచ్చి సుభద్రమ్మ"ను చూసి జాలిపడతాం.

‘రాజుగారి బూజుగదిలో చిత్రాంగి"ని చూసి భయపడ్డాం.

“చీర మీనం” కథలో స్త్రీ మాతృత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాం. ఈ కథల్లో దీపక్ రాజ్ గారు వాడిన భాష ఎంతో సరళమైనది. ఆయన వాడిన పడికట్టు పదాలు, చేసిన పద ప్రయోగాలు, కథలకు పెట్టిన పేర్లు, ఆ కథల్లో పాత్రలు మనల్ని మళ్ళీ మళ్ళీ చదివించేలా చేస్తాయి.

కథల్లో కోనసీమ యాసని చూసి తెలుగు భాష తప్పక మురిసిపోతుంది.............