మన మహూన్నత సంస్కృతి సంప్రదాయ ఆర్ష విజ్ఞాన అధ్యయన తేనెచినుకులు ఆస్వాదన ఆరంభించిన అష్టవర్ష అనుభూతుల నుండి నలభై సంస్కృతి లఘు వ్యాసాలను, ఇరవై సాంప్రదాయ మంచి మాటలను పది మంది పాఠకులకు పంచి పెట్టిన ఆనందంతో చిందించిన మరో "సుధాబిందు సందోహమే" శోడష రుచులందించే "మకరంద బిందువులు"!
ఇందులో....
నిర్వాకార నిర్వకల్ప నిరామయ నిరంజనమైన భగవత్ స్వరూపాన్ని నిర్వచించే మూడు ముచ్చటైన ముక్తి మాటలు.....
సత్యమ్................., శివమ్.............., సుందరమ్.
గృహస్థాశ్రమ ధర్మ విశిష్టతను వివరించే
స్త్రియః గృహాస్యకతః
గార్హస్థ్యo శ్రేష్ఠముత్తమమ్
మన సంస్కృతికి మాత్రమే ప్రత్యేకమైన
వందనం ! మన సంస్కృతి నందనం!!
దానమేకం కలియుగౌ......
వసుధైవ కుటుంబకమ్..
అక్షరార్చన ఆవశ్యకతను ఆవిష్కరించే
అక్షరం! అక్షరాభ్యాసం!
అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే
ఓం శాంతి శాంతి శాంతి
మన సంస్కృతి సాంప్రదాయ వ్యాస విశేషాలు, విశ్లేషణలు
ఆస్వాదించాలంటే..... అనుభూతి చెందాలంటే ఈ మకరంద బిందు మాధుర్యాలను చవి చూడవలసిందే.