Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆత్మశక్తి, అంతర్దృష్టి, సునిశిత హాస్యం కలగలిసిన ఓ అమెరికన్ స్నో బోర్డర్
హిమాలయాలను సర్ఫింగ్ చేయడానికి నేపాల్ వచ్చి, అనూహ్యంగా తన అంతర్ హిమాలయాలను అధిరోహించి,
శిఖరానుభూతులను పొందిన వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా మనస్సుకు హత్తుకునే విధంగా రూపొందించిన కథ !
కర్మ సంబంధమైన ఓ ప్రమాదంలో
ఈ యువకుడు, మాస్టర్ ఫ్వాప్ అనే బౌద్ధగురువును ఢీకొట్టి ఆ తరువాత ఆయన దగ్గర ఆధ్యాత్మిక శిష్యరికం చేసి
స్నో బోర్డింగ్ ను జ్ఞానోదయానికి మార్గంగా ఉపయోగించుకుంటారు. మనోహరమైన జ్ఞాన బోధనలో అద్భుత ప్రావీణ్యం కలిగిన మాస్టర్ ఫ్వాప్
మనస్సును ఆలోచనారహితం చేసి,
చైతన్యాన్ని సవాలు చేసి నిత్యజాగృతితో ఎవరైనా, ఎంతటి పర్వత శిఖరాలనైనా అధిరోహించి మాస్టర్ కాగలడని నిరూపించారు. ప్రపంచ ప్రఖ్యాత స్నో బోర్డర్, మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ గ్రహీత మాత్రమే కాక, డా!! రామా ఫ్రెడెరిక్ ఫిలిప్స్ లెంజ్ ఒక ఉత్తమ రచయిత, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక సంగీతజ్ఞుడే కాక అధునాతన సాంకేతిక సంస్థలలో
చురుకుగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక, వ్యాపార నిర్వహణ మరి విద్యాసంబంధిత సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను
అభివృద్ధి చేసి ఆ సంస్థలకు నిర్దేశకత్వం వహించారు. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్లో డిగ్రీ పూర్తిచేసి,
స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, స్టోనీ బ్రూక్ లో ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ పొందారు. ఈయన, న్యూయార్క్ మరి శాంటా ఫెలలో జీవించి, ఏప్రిల్ 12, 1997
నుంచి అనంత శాశ్వత నిర్వాణంలో తరిస్తున్నారు.