పాల సముద్రము పై లక్ష్మి సామెత శ్రీ మహా విష్ణువు శయించి యుండగా మహా విష్ణువు హఠాత్తుగా లేవగానే, ఆ సమయములో భూదేవి విలపించుచు శ్రీ మహావిష్ణువు పాదములు సృజియించి "సర్వేశ్వరా ! భూలోకమున ప్రజలు స్వార్థపరులై అనేక పాపకార్యములు చేయుచు భ్రష్ఠులగుచున్నారు. కుల ధర్మములు నశించినవి. భక్తి, వినయాలు పూర్తిగా విస్మరించి వావి వరసలు మరచి క్రూర వర్తనులై సంచరించుచున్నారు. అసత్యమై వారికీ భూషణమయింది. ఈ పాప భారము నేను భరింపలేక యుంటిని. మీరు భూలోకమందు అవతరించి భూభారం తగ్గించమని వేడుకుంది. ఆ సమయములో మహాలక్ష్మి దేవి ప్రక్కనే వుంది.
భూదేవి మాటలకూ శ్రీ మహావిష్ణువు ఆమెను ఓదార్చి "నేను బ్రహ్మ మహేశ్వరులను పిలిపించి కర్తవ్యం నిర్ణయిస్తాను. నాతోపాటు వారిరువురు భూలోకమున అవతరించి నీ భారం తగ్గించగలం. నీవు నిర్భయముగా వెళ్ళమని" ఆశీర్వదించి పంపెను.