Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

ఉపోద్ఘాతము

లోకవ్యాపకంబై వెలయునట్టి మహామంత్రములు యేడుకోట్లు గలవని వాడఁబడుదురు. ఇట్టిమంత్రములకు అధిదేవతలయందు యేదియైనను ఒక్కటి అభ్యసించి వాటిలోగల రహస్యమును గురుముఖాంతరముగా గుర్తెరిగి తాను కైవల్యము పొందుటయే మంత్రయోగ మనబడును.

యజ్ఞము, యాగము, హోమము, తర్పణము మొదలగు వాట్లను జరుపు, సమయములందు వాక్కున పఠించుటే మంత్రయోగ మనబడును.

మూలాధారము, స్వాధిష్టము మణిపూరకము, అనాఘతము, విశుదము, ఆజేయమగు ఆధారములయందుగల చక్రములను గుర్తించి వాటికిగల అధిదేవతలను స్మరింపుచు వందలకొలది జపించుటయే మంత్రయోగ మనబడును.

మోక్షాపేక్షగలవారలు మంత్రానుష్టానము, జపానుష్టానము తపానుష్టానము లను దెలిసి చరించునపుడు షడాధారములను గుర్తెరిగిన పిదప ఇడా పింగళ సుషుమ్నలను నాడీత్రయములను తమ స్వాధీనము చేసికొనవలెను.

వీటికి గంగా యమునా సరస్వతులనియు, త్రికూటములనియు, శృంగాటకములనియు, నాదబిందుకళలనియు, పూర్వాచార్యులచేతను మహాఋషులచేతను అభ్యాసయోగులచేతను పిలువబడుచున్నవి.

ఇది తమ అలవాటునకు వచ్చునపుడు రేచకపూరక కుంభకము లగును. వీటినే ప్రాణాయామమని చెప్పుదురు. యీప్రాణాయామ విధి సకల మంత్రములు కును, సకల యంత్రములకును ఉపయోగమగును దినక్రమమున యీఅలవాటుచే కుంభకమున నిలచువారలకు యముడు లేడు పెక్కుదినములు జీవించి యుండవచ్చును.

222 223

224

యీలాంటి పరిచయ పరులకు రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, డంభము, ధైర్యము, అహంకారములను యీపదమూడున్ను శత్రువులగును, గాన వీటినెల్ల విడచి