ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటాం సూర్యోదయాన్ని.
అది సూర్యోదయపు అందం.....
అది సూర్యోదయపు అవసరం.
మహాభారతము అంతే!
అచ్చం సూర్యోదయం లాంటిదే.
అది అందమూ అవసరాల కలబోత.
అసలు భారతం అంటేనే ప్రకాశమని అర్థం. అందుకే వేల సంవత్సరాలుగా ఎందరో కవులూ రచయితలూ మహాభారత రచనను చేస్తున్న ఈనాటికి నిత్యనూతనంగా ఇంకా దాని ప్రతిధ్వనులు వస్తూనే ఉన్నాయి. దేని అందం దానిదే... దేని సందేశం దానిదే...
- గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ