Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
భూమిక
మధురాంతకం రాజారాం గారు (1930-1999) జగమెరిగిన, జగము నెరిగిన తెలుగు కథకులు.
రాయలసీమలో ఆలస్యంగా ఆధునికకథ ప్రారంభమైనప్పటికీ, ఆ ఆలస్యాన్ని గుర్తుకు రానివ్వకుండా వేగవంతంగా వందలాది కథలు రాసి ఎందరో రాయలసీమ కథకులకు వస్తువునూ, శిల్పాన్ని ప్రోదిచేసి పెట్టిన ఘనత రాజారాంగారిది!
రాయలసీమ కథ అనగానే రాజురాంగారు, రాజారాం గారు అనగానే రాయలసీమ కథ అని గుర్తుకు వచ్చేలా విడదీయరాని బంధంగా భాసిల్లిన వారాయన! నిర్దిష్టమైన
స్థలకాలాల స్పృహతో, ప్రాంతీయ చిత్రణతో, ప్రాదేశిక ముద్రతో, విస్తారమైన జీవితానుభవంతో, వస్తువైవిధ్యంతో, తెలుగు కథకు క్రొంగొత్త రూపురేఖల్ని సమకూర్చి పెట్టిన వాడాయన! మంచినీ మానవతనూ, కరుణనూ దయనూ, ప్రేమనూ ఔదార్యాన్నీ, నీతినీ నిజాయితీనీ, సంస్కారాన్ని సౌజన్యాన్నీ తన కథల ద్వారా తెలుగు పాఠకలోకానికి దోసిళ్ళతో పంచి పెట్టిన మానవీయ కథకుడాయన! మధ్యతరగతి ఆడంబరాలనూ కుహనా విలువల్ని, అవహేళన చేస్తూ, శ్రామికవర్గ సంస్కారాన్ని ఉన్నతీకరిస్తూ శ్రమైకజీవన సౌందర్య సాక్షాత్కారం గావించిన వారాయన! సాహిత్యం కేవలం సాంఘిక దౌష్ట్యాలపై దాడిచేయడమేగాక, మనుష్యుల్లో మంచినీ, మానవతనూ వెలిగించడానికి కూడా దోహదపడాలని తన కథల ద్వారా నిరూపించిన వారాయన! రాయలసీమ జనజీవిత విన్యాసాలను, ప్రత్యేక భౌగోళిక స్వరూప స్వభావాలను అపూర్వమైన ఛాయచిత్రాలుగా తన కథాసాహిత్యం ద్వారా ప్రదర్శించిన వారాయన!
రాజారాంగారు, 1930 అక్టోబర్ 5వ తేదీన చిత్తూరు జిల్లాలోని ఒక 'మారుమూల కుగ్రామం, రమణయ్యగారిపల్లెలో విజయరంగ పిల్లె, ఆదిలకము దంపతులకు జన్మించినారు. తండ్రి దగ్గరే ప్రాథమిక విద్య పూర్తిచేసి చితూరులో హైస్కూల్లో విద్య అభ్యసించి, అక్కడే టీచర్ ట్రైనింగ్ చదివి, ప్రాథమిక పాఠశాల............