తెలుగువారి చరిత్ర, సంస్కృతుల గురించి గత శతాబ్దికాలానికి మించి అనేక పరిశోధన గ్రంధాలు వెలువడ్డాయి. కొన్ని సుప్రసిద్దులైన చరిత్రకారులు రచించినవి, మరికొన్నిఅంతే ప్రసిద్ధులు సాహిత్యకారులైన పండితులు రచించినవి. విశ్వవిద్యాలయాలలో కూడా గణనీయమైన పరిశోధన జరిగింది. ఈ విద్వాంసుల రచనలు కొన్ని ప్రచురితమయ్యాయి. పండితులు, చరిత్ర ప్రేమికులు ఈ గ్రంధాలను ఆదరించారు. మరికొన్ని రచనలు అలాగే అప్రచురితంగా ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1976 స్థాపితమై నాలుగు దశాబ్దాలు పూర్తి చేసికొని నిరంతరాయంగా తన కృషి సాగిస్తుంది. క్రమబద్ధంగా జరుగుతున్న వార్షిక మహాసభలలో పండితులు, పరిశోధక విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాల సంపుటాలను చరిత్ర కాంగ్రెస్ ప్రచురిస్తున్నది.
-డా||రామాయణం నరసింహ రావు.