Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

కర్ఫ్యూ తెలుసు

144 సెక్షన్ తెలుసు..

నా అరవై ఏళ్ల వయస్సులో అనేక కర్ఫ్యూ రోజులు చూశాను.

చిన్నప్పుడు అబ్బా ఇంకా కొన్ని రోజులు ఈ కర్ఫ్యూ ఉంటె బాగుండు.

స్కూల్ కి వెళ్లక్కరలేదు అనుకున్న రోజులు కూడా గుర్తున్నాయి.

కానీ, ఇలాంటి భయానకమైన రోజుల్ని చూడలేదు.

నిర్మానుష్యమైన రోడ్లను, భయంతో రేపటి గురించిన చింతతో

పిల్లలను చంకన, మూటలను నెత్తిన పెట్టుకొని మైళ్ళకు మైళ్ళు నడిచి

సొంత ఊరికి పయనమైన వలస కార్మికులు, ఉన్నపాటున ఉపాధి కోల్పోయి

దిక్కులేకుండా అయిపోయిన చిరు ఉద్యోగుల కన్నీళ్లు, ఇల్లు వాకిలి లేక

జీవితాలు వెళ్లబుచ్చే అనేక మంది అనాధల ఆకలి కేకలు,

ఎన్నెన్నో హృదయవిదారక దృశ్యాలు...

జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నకి మాటల్లో లేని సమాధానం

మీడియా చూపించింది. ఈ పరిస్థితుల్లో ఆవేదనతో విలవిలలాడే

నా అభిమానులకి, నా పాఠకులకి కొంత సేపన్నా చిరుజల్లులాంటి

ఓదార్పు నివ్వడానికి, కొన్ని పూరేకులు, మరికొన్ని పూతరేకులు కలిపి

అందించిన చిరుకానుక నా ఈ

లాక్ డౌన్ వెతలు

                                                                                      - అత్తలూరి విజయలక్ష్మి