Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

ఓ రెండు నవలలూ - ఓ రెండు మాటలూ!!

ఓ రెండు నవలలూ! ఓ రెండు మాటలూ!! పురుషులందు పుణ్యపురుషులు వేరనటుగా రచయితల్లో మంచిరచయితలువేరు. ఈ రచయితలకు సమాజం కావాలి. సమాజం బాగోగులు కావాలి. సమాజంలో మంచి మార్పులు కావాలి. ఆ మార్పులకోసం అహర్నిశలూ రాస్తూ ఉంటారు. శ్రమిస్తూ ఉంటారు. రచన ప్రారంభించడమే తమ బాధ్యత అనుకోరు.

దానిని పాఠకునిచేత చదివించి ముగించి, మురిసిపోతారు. ఆఖరికి అంతా కథలుగానే మిగులుతాం. పుస్తకాన్ని మించిన మంచిమిత్రుడు లేడు. చదువు. కాలు కదపకుండానే ప్రపంచాన్నంతా చుట్టిరాగలవు అంటారు. ఏకాగ్రతగా ఓ అరగంట చదువు! మాయలూ, మానవసంబంధాలూ, మంచిచెడులూ తెలుసుకో అంటారు. ఏ గొప్పపుస్తకమూ ఒకేసారి తనలోని రహస్యాలన్నీ నీకు చెప్పదు. పదేపదే తనని చదవమంటుంది. పలవరించమంటుంది. పలవరించావో అద్భుతదీపం సాధించగలవు అంటారు. అక్కున చేర్చుకుంటారు. పాఠకుణ్ణి అలా అక్కున చేర్చుకునే రచయితే శ్రీ రావులపాటి సీతారాంరావు.

ఆయన అనేక కథలూ, నవలలూ రాసి ఉండవచ్చుగాక. ఈ పుస్తకంలోని చికటిలో చిరుకాంతి, లాయర్ ఇంద్రజిత్ రెండు నవలలూ అందుకు భిన్నం. ఈ రెండునవలలూ మనతో సంభాషిస్తాయి. మనతో వాదిస్తాయి. మనం చెబితే వింటాయి. ఆఖరి పేజీలు చదివి, నవలలు రెండూ ముగించాం అనుకునేవేళకి, అంతవరకూ భుజమ్మీద ఆప్యాయంగా ఉన్న చేయి ఏదో అదృశ్యం అయిన భావన కలుగుతుంది. కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఒక కలానికీ, ఒక పుస్తకానికీ, ఒక రచయితకీ ఇంతకంటే కావాల్సిందేమీ లేదు. వెలుగు తెల్లగా ఉండాలి. వెన్నెల చల్లగా ఉండాలి. అలాగే మనిషి మర్మం లేకుండా ఉండాలి. పోలీసాఫీసరు అయినాసరే...మర్మాలులేని వట్టి సీతారాంరావు. అద్దంలాంటి మనిషి. సరదాగా పలకరించి చూడండి.

ఆయనలోనే కాదు, ఆయన రచనల్లో కూడా మీరు ప్రతిబింబిస్తారు. పాఠకునికి ప్రతపుస్తకమూ ఓ జీవితమే! ఎన్ని పుస్తకాలు చదివితే అన్ని జీవితాల్ని చవిచూసినట్టు, అందునవలలూ రెండు జీవితాలు. ఈ రెండు జీవితాలూ ఎంతసేపు? గంటలో

భావిస్తాం. కాని నిండునూరేళ్ళూ గుండెల్లో గురుండిపోతాయి. పుస్తకాలు బత్తాయి. పుస్తకాలు వర్షిస్తాయి. పుస్తకాలు రగిలిసాయి. పుస్తకాలు చలి పెడతాయి. లు ఉన్నయినా సాధిస్తాయి. కావాలంటే చదివి చూడండి! మీకే తెలుస్తుంది..

- జగన్నాథశర్మ సుప్రసిద్ధ రచయిత, పూర్వ సంపాదకులు, 'నవ్య' వారపత్రిక...............