హిందూ దేశంలో ఉత్తర హిందూస్థానంలో అనేక మంత్ర శాస్త్రాలు విశేష ప్రచారంలో నాగరిలిపిబద్దమయి సంస్కృతంలో వున్నవి. కాని ఆంధ్ర దేశంలో సరియైన మంత్ర లేక తంత్ర శాస్త్రాలు లేవనే చెప్పవచ్చు.
కాని శ్రీ దేవరకొండ శేషగిరిరావు గారు ప్రస్తుతం ఆలోటు తీర్చుటకు పూనుకొని - మొట్టమొదటగా తంత్ర పరిచయము కులార్ణవ తంత్రము - సంపాదించుట మూలశ్లోకములతో ఆంధ్రభాష లో అర్థమును వ్రాసి - ఆంధ్రులకు అందుబాటుచేసి ఆలోటును తీర్చినారు.
శాస్త్ర సమ్మతమైన అవగాహన నియమములు - వాటి ప్రాశస్త్యము - పండితులయిన వారికి తప్ప సామాన్యులకు తెలియదు. గాన సామాన్యులకు కూడా అర్థమయ్యే సులభ శైలిలో రచన గావింపబడింది గాన - తంత్ర శాస్త్రములలో నున్న సారాంశములను గ్రహించి - సద్గురువుల ద్వారా బాగుగా తెలుసుకొనే అనుష్ఠాన పరులకు ఎంతయో ఉపయోగము కాగలదనే భావనతో దీనిని ప్రచురించడమైనది.
- శ్రీ దేవరకొండ శేషగిరిరావు