Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹400

మనసులోని మాట

“నాట్యం ధార్మిక ప్రవృత్తిని కలిగిస్తుంది. యశస్సును ఇస్తుంది. ఆయుర్దాయం పెంచుతుంది. హితోపదేశం చేస్తుంది. బుద్ధిని పెంచుతుంది. లోకం పోకడను తెలుపుతుంది" అని భరతుడు నాట్యశాస్త్ర ఆరంభంలో చెప్పాడు.

భరతుడు చెప్పిన మాటలు వింటే ఆయన నాట్య పక్షపాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే లలితకళలు అన్నింటివలన పైన చెప్పిన ప్రయోజనాలు సమకూరతాయి. భారతీయ కళల పరమార్గం కూడా ఇదే. మరి భరతుడు ఎందుకలా చెప్పాడు. నాట్యం సమాహారకళ కాబట్టి

నాట్యంలో లేని జ్ఞానంగాని, శిల్పంగాని, విద్యగా, కరగాని, యోగంగాని, కర్మగాని లేవని భరతుని వాక్కు నాట్యం నేర్చుకుంటే అన్ని విద్యలు వచ్చేస్తాయి అని అర్థం కాదు. నాట్యం అభ్యసిస్తే పలు విషయాల మీద ప్రాథమిక పరిజ్ఞానం కలుగుతుందని అన్వయం చేసుకోవచ్చు.

కళ మనిషి జీవితానికి ఒక క్రమం నేర్పుతుంది. క్రమశిక్షణనిస్తుంది. ఏకాగ్రతను పెంపొదిస్తుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా, సునిశితంగా, సుస్పష్టంగా వ్యక్తం చేయగల వ్యక్తిత్వాన్నిస్తుంది. నూతన విషయావిష్కరణవైపు, నవ్యమార్గంవైపు, నాణ్యమైన నడకకు, నడతకు కు నాంది అవుతుంది. చదువు బుద్ధివికాసాన్ని కలిగిస్తే, కళ మనోవికాసాన్ని కలగజేస్తుంది.

ఈ రోజుల్లో పాఠ్యపుస్తకాల పుటల్లో పసితనం నలిగిపోతుంది. బాల్యం మార్కుల మాయాజాలంలో చిక్కి మలమల మాడిపోతుంది. ఒత్తిడికి లోనై జ్ఞాపకత్తిని మెదడులోనుంచి ఎమె రికార్డులోకి మార్చి మరమనిషిలా మారిపోతున్నాడు, మసలుతున్నాడు. కారణం మానసిక, శారీరక శ్రమ లేకపోవటం, తద్వారా అశాంతికి లోనై జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతున్నారనటం అతిశయోక్తి కాదు. ఈ విధమైన పరిస్థితుల్లో కళాభ్యాసంవల్ల వారి జీవితాలు వికసిత శ్వేతకమలాలవుతాయనటం అసత్యం కాదు.

ఈ సందర్భంలో ఒక నృత్వ అధ్యాపకుడిగా కూభ్యాసం చేసేవారికి, ముఖ్యంగా నాట్య విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందిచడానికి ఒక కార్యక్రమం రూపొందించాలన్న సంకల్పమే మహామంజీరవారం అనే కార్యక్రమం.

నాట్యాభ్యాసం చేసేవారి సంఖ్య గతంలో కంటే నేడు ఎక్కువగా ఉన్నప్పటికీ వారిలో శ్రీ సామ్యూలు, అభ్యాససాధనాలు కొరవడ్డాయి. ముందే మనవి చేసినట్లు అంశాలను ధారణచేసే క్రమం కుంటుపడది. బృందనాట్యంలో ప్రక్కవారిని చూసి ప్రదర్శనని పూర్తిచేయటం పరిపాలయ్యింది. హై ఒకొక్కటి పట్టుకుని పదినిమిషాలైనా ఉండటం లేదు. అంతకుమించి వేదికమీద నృత్యాంశం ప్రదర్శించడానికి శక్తి చాలటం లేదు. కారణం అభ్యాసనలో సరిగా సాధన చేయగకపోవటం కాబట్టి ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క గంట తన ప్రదర్శననివ్వాలని "మహామంజీరనాదం" నిబంధన విధించింది. ప్రదర్శనలు 09.08.2012 నుండి 18.08.2012 వరకు నిర్వహించడానికి సంకల్పించబడింది...........