Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                   హెర్ రాజు (Herod), యూదా (Judea) దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో పూజారి జకరయ్య (Zacharias) ఎలిజబెత్ (Elizabeth) దంపతులు దేవుని దశాబ్ధులను పాటిస్తూ దైవసన్నిధిని కాలం గడుపుతున్నారు. వయోవృద్ధులైన ఆ దంవతులకు ఒకనాడు గాబ్రియెల్ (Gabriel) దేవదూత దర్శనమిచ్చిదైవనిర్ణయం ప్రకారం వారికి మగశిశువు జన్మించునని, అతడు రాబోయే యూదుల ప్రభువు కొరకు మార్గం సిద్ధం చేయునని తెలిపినాడు. ఆశ్చర్యంతో, సందేహంతో నిశ్చేష్టుడైన జకరయ్య మాట పలుకులేని వాడైనాడు.

                     గాబ్రియేల్ దేవదూత గెలిలీ ప్రాంతపు నజరేత్ (Nazareth) గ్రామానికి వెళ్లి అక్కడ డేవిడ్ వంశీకుడైన జోసెఫ్ అనునతడికి నిశ్చయింపబడిన మేరీ అను కన్యకతో పలికినాడు- 'జగత్ర్పభువుచే ఎన్నిక చేయబడిన కన్యకకు జయమగుగాక. స్త్రీలందరిలోనూ ఉత్తమురాలివిగా ఆశీర్వదింపబడినావు'

మేరీ నిరుత్తరాలై నిలబడినప్పుడు ఆ దేవదూత పలికినాడు- 'నీకు కలుగబోవు కుమారునికి 'జీసస్' అని పేరు పెట్టుము. ఆతడు డేవిడ్ ప్రభువు సింహాసనాన్ని అధిరోహించి ఎల్లలు లేని సామ్రాజ్యాన్ని పరిపాలించనున్నాడు' -

                   'అదెలా సాధ్యం ? నేను కన్యను' -అన్నది మేరీ. దేవదూత సమాధాన మిచ్చినాడు- 'పవిత్రాత్మ నిన్ను తన దానినిగా చేసుకొనును. అత్యున్నతుని ఆశీర్వాదంతో నీకు కలుగబోయే కుమారుడు పవిత్రమూర్తిగా, దేవుని కుమారునిగా పిలువబడగలడు'.

"Behold, I am the hand maiden of the Lord".
Mary said- "Let it be to me as you have said"

మేరీ వెంటనే తన దూరపు బంధువులైనజకరయ్య ఎలిజబెత్ ల ఇంటికి వెళ్లి వారిచే ఆశీర్వదింపబడి, గుర్తింపబడినదై మూడు నెలలు వారితో కాలం గడిపి తిరిగి తన ఇంటికి చేరుకున్నది.