విలువ, నీతి నిజాయితి - ఈ మూడు కలిస్తేనే ధర్మ ప్రతిష్ఠ సాధ్యమయ్యేది. ఈ మూడు అంశలతో ఉన్నతం కాగలిగినపుడే మనం ధర్మజ్ఞులం కాగలిగేది.... వ్యవస్థ ధర్మబద్ధమయ్యేది... కుటుంబాలు సంఘటిత ధర్మానికి నెలవులయ్యేది.. వ్యక్తులుగా మనం అధములం కాకపోవటం వ్యక్తి ధర్మం. కుటుంబాలుగా కలతలకు, కార్పణ్యాలకు ఒడి గట్టక పోవటం కుటుంబ ధర్మం. సామాజికుల మధ్య సమరసభావం నెలకొనేలా చూడటం సమాజ ధర్మం. బాలెన్సింగ్ చేయటం వ్యవస్థాధర్మం. ఇలా వ్యక్తిగానైనా, కౌటుంబికంగానైనా, సామాజికంగా నైనా, వ్యవస్థా పరంగానైనా దిగజారకుండటం మానవ ధర్మంలా కనిపించే సృష్టిధర్మం.... విశ్వ ధర్మం. ఇదే మన జీవనగీత.
- డా. వాసిలి వసంతకుమార్