వంశీ సంస్థ ప్రముఖ రచయిత్రి డా|| తెన్నేటి లత "మోహనవంశీ" నవల ప్రభావంతో 1972 లో ఆవిర్భవించింది. అప్పట్నుంచి లెక్కకు మించిన సాహితి సాంస్కృతిక సేవ కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నది. 2017 నుంచి "కొత్త కధలు" అనే శీర్షికతో కథాసంకలనాన్ని అమెరికాలో ఉంటున్న డా|| శ్రీనివాసరెడ్డి ఆళ్ళ సహకారంతో ప్రచురించడం జరుగుతున్నది. మొట్టమొదటి సంకలనం 2017 లో 33 మంది రచయిత్రులు రాయగా ఆ సంకలనాన్ని డా|| సి, నారాయణరెడ్డిగారిని స్మరిస్తూ ముద్రించాము. 2018 లో 65 మంది కధారచయితల రాసిన కథాసంకలనాన్ని యద్దనపూడి సులోచనా రాణి స్మరణలో ముద్రించాము. 2019 లో 70 మంది రచయితలు రాసిన సంకలనాన్ని నటసామ్రాట్ అక్కినేని స్మరణలో ముద్రించడం జరిగినది.
ఎక్కడ ముద్రితం కానీ కధలను ప్రతి రచయిత ప్రత్యేకంగా ఈ సంకలనం కోసం రాసివ్వడం మరువలేము.
-వంశి ప్రచురణలు.