Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹190

సంపాదకుల మాట స్త్రీలు చెప్పమన్న కథలు

కథ రాయాలని కూచున్నప్పుడు రచయిత ఎదురుగా ఒక స్త్రీ వచ్చి 'నా కథ రాయి' అనే సందర్భాలు గతించిపోయేలా లేవు. 1980ల తర్వాత స్త్రీవాద దృక్పథంతో కథ, నవల తెలుగులో వికసించినా నాటి నుంచి నేటి వరకూ వందల కథలు వెలువడా రచయిత ఎదురుగా స్త్రీలు కూచుని 'మా కథ రాయవేమి?' అని డిమాండ్ చేస్తూనే ఉన్నారంటే అనంత ముఖాల స్త్రీ సమస్యల ప్రాసంగికత ఎప్పటికీ గతించిపోదనే | అనిపిస్తున్నది.

కొత్త కథ - 2022లో తొమ్మిది కథలు స్త్రీల మానసిక, భౌతిక, సామాజిక సమస్యలను చర్చించే ప్రయత్నం చేయడం ఒక ముఖ్యమైన పరిశీలనాంశంగా తీసుకోవాలి. ఎదగవలసినట్టుగా ఎదగలేకపోయిన అమ్మాయి' కథ నుంచి 'అవసరం లేనంతగా ఎదిగిన గృహిణి' కథ వరకూ రచయితలు ఈ సంకలనంలో కథనం చేశారు. ఇంత వైవిధ్యమైన చూపు కలిగి ఉండటంలో 'రైటర్స్ మీట్ భాగస్వామ్యం ఏ కొంచెమైనా ఉంటుందనే భావన మాకు సంతోషం కలిగిస్తున్నది......