Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹400

మనందరమూ అన్ని సమయాల్లో

ప్రతిమనిషి జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. చాలా సందర్భాల్లో ఆ నిర్ణయం సరైనదా కదా అనే మీమాంస కూడా తప్పదు. అప్పటి సందర్భాన్ని, పరిస్థితులని బట్టి తను తీసుకునే నిర్ణయం మంచిదా కాదా అని తేల్చుకోవడమే మనిషికి చేతనైన పని. అయితే స్థల కాలాలకి అతీతంగా తప్పొప్పుల మధ్య గీతగీసి ప్రవర్తించగలిగే శక్తి ఎందరికి ఉంటుంది? గతంలోని నేరాలకు పశ్చాత్తాప పడినంత మాత్రాన పరిణామాలు మరోలా ఉంటాయా? ఇవన్నీ మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో తప్పక ఎదురయ్యే ప్రశ్నలే. మనస్పూర్తిగా కోరుకుని, మరొకదారిలేదని నమ్మి చేసిన పనులు, తర్వాతి కాలంలో తప్పులుగా రుజువైనప్పుడు, ఒకరి మనసు ఎంచుకున్న మార్గం ఇతరుల్ని కష్టాలకి గురిచేసిందని తెలిసొచ్చినప్పుడు, బాధతో కుమిలిపోయేకంటే పరిణామాలకి బాధ్యత తీసుకోవడం నయమని ఎందరికి స్ఫురిస్తుంది? తనవాళ్ళు అంటే తనవల్ల చెదిరిపోయిన వాళ్ళు కూడా అనే ఎరుక ఎందరికి కలుగుతుంది? లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా, కష్టసుఖాల కొలతలు లేకుండా జీవితం చూపించిన మలుపుల్లో సామరస్యంగా సాగిపోయే మనుసషులు ఎందరుంటారు? అటువంటి కొద్దిమంది మనుషుల జీవిత గాధలే మీరు చదవబోతున్న ఈ పుస్తకం.

కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే మార్గాలు ఆ వ్యక్తుల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రెండవ వ్యక్తి సమాజమే కాబట్టి కుటుంబాలు, సమూహాలు కూడా అతి సహజంగా,.........