కొండవీడు మధ్యయుగంలో ఆంధ్రదేశపు రాజకీయ, సాంస్కృతిక రంగాలలో చక్కని పాత్ర పోషించింది. కొండవీడు రెడ్డి రాజులందరూ సాహిత్యప్రియులు, దానశీలురు, సంస్కృతాంధ్ర భాషలను పోషించారు. శ్రీ నాథధీ మహా కవులను ఆదరించారు. కొండవీటి సామ్రాజ్యమ్ గురించి నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి పాపయ్యశాస్త్రి, పోణంగి శ్రీరామ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, మారేమండ రామారావు ప్రభృతులు రాసిన వ్యాసాల సంకలనం కొండవీడు చరిత్ర వ్యాసాలు.
- కొండవీడు హెరిటేజ్ సొసైటీ