Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
భూమికగా
సాహిత్యం సామాజిక చైతన్య రూపం. సందర్భమే వాగ్వ్యవహారానికి అర్థం ఇస్తుంది. చారిత్రిక, సామాజిక సందర్భంలోనే భాషా కళ అయిన సాహిత్యం నిర్దిష్ట రూపంలో అర్థం అవుతుంది. ఇతర సామాజిక దృగ్విషయాలతో సాహిత్యానికున్న సంబంధాన్ని అవగాహన చేసుకోగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. సాహిత్యాన్ని సాహిత్య ప్రమాణాలతో మాత్రమే పరిశీలించాలనే అభిప్రాయం ఒకటి ఉంది. సాహిత్యం విశిష్టులు, ప్రతిభా సంపన్నులు అయిన వ్యక్తుల సృష్టి మాత్రమే అని భావించే సంప్రదాయ వాదులలోను, సాహిత్యంలో భాషను ప్రయోగించే పద్ధతులను, శైలీ విశేషాలను ప్రధానంగా అధ్యయనం చేసే శైలిశాస్త్ర, నిర్మాణవాద విమర్శకులలోను ఈ అభిప్రాయం బలంగా ఉంది. సాహిత్యం , సాహిత్య ప్రమాణాలు ప్రత్యేక స్థల, కాలాల్లో అస్తిత్వాన్ని పొందుతాయి. సామాజిక దృగ్విషయాల అన్యోన్య ప్రతిక్రియ ఫలితమే సాహిత్యం . సామాజిక పరిస్థితులను గురించిన అవగాహన రేఖామాత్రంగానైనా ఉన్నప్పుడే సాహిత్యాధ్యయనం స్పష్ట రూపాన్ని పొందుతుంది. అయితే సాహిత్యాధ్యయనంలో చారిత్రిక, సామాజిక నేపథ్యం అర్థం చేసుకోవటం ప్రాధాన్యం వహిస్తుందే కాని, అది మాత్రమే సాహిత్యాధ్యయనం కాదు. ఆ నేపథ్యంలో వస్తువుకి, రూపానికి ఉన్న సావయవ సంబంధాన్ని పరిశీలించగలిగినప్పుడే సమగ్రమైన సాహిత్య అధ్యయనం అవుతుంది. చారిత్రిక, సామాజిక పరిశీలన ఇటువంటి అధ్యయనానికి ప్రధాన సాధనం అవుతుంది. ప్రస్తుత సామాజిక నేపథ్యంలో ఇంతకుముందు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చారిత్రిక, సామాజిక పరిశీలన ముఖ్యమైన ఉపకరణం అవుతుంది.
సామాజిక చరిత్ర పరిధిలో సాహిత్యాన్ని పరిశీలించడంలో ఈ సంకలనంలోని వ్యాసాలు ఒక ప్రయత్నం మాత్రమే (చూ. సి.వి. సుబ్బారావు, అనిశ్చిత అన్వేషణ (సంపాదకీయ వ్యాసం), విభాత సంధ్యలు. 1986). ఇది సర్వసమగ్రమైన అధ్యయనం కాదు. ఈ రంగంలో జరుగవలసిన అధ్యయనం ఇంకా చాలా ఉంది. చారిత్రిక, సామాజిక సందర్భం, పోషకత్వం మొదలైన అంశాల నేపథ్యంలో సాహిత్యరూపాలు తెలుగు సాహిత్యం చారిత్రిక భూమిక............