మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమాడమే అరుణాంక్ "ఖ్వాబ్" ప్రత్యేకత. యూ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. యిప్పుడు అరుణాంక్ "ఖ్వాబ్ " లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళి ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండు వేరుకాదని, విప్లవం అంటే మనిషితనం పై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.