Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఉద్వేగం, తార్కికత మూర్తిని కాల్పనిక రంగంలోకి నడిపించాయి. ఆయన కథా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దాయి. తన గురించి తెలిసిన వాళ్లయితే ఇది మూర్తి వ్యక్తిత్వమే అంటారు. ఆయనలోని సకల ఉద్వేగాలను నింపాదిగా, సాంద్రంగా, గాఢంగా అనుభవించిన సన్నిహితులకు ఈ సంగతి తెలుసు. ఆలోచనాపరుడిగా తనలోని తార్కికతే రచయితలోని భావోద్వేగ వ్యక్తీకరణ. నిజానికి తన కథా శిల్పం కూడా భావోద్వేగాలు, తార్కికత కలిసి రూపొందినదే. ,
కథా రచనలో మూర్తి ఇరవై ఏళ్ల విరామం తీసుకున్నాడు. కానీ జీవితాన్ని, సమాజాన్ని, ఉద్యమాలను తనదైన పద్దతిలో గమనిస్తూ వచ్చాడు. ఈ ఆలోచనలు అవగాహనలు తనలో ఒక కొత్త సృజన తలాన్ని రూపొందించాయి. దీనితో నిమిత్తం లేకుండా ఈ రెండో దశ కథలను అంచనా వేయలేం. వాటి ప్రత్యేకతలను విశ్లేషించలేం.
- పాణి