Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మనసులో మాట
మనసులోంచి తన్నుకొచ్చే ఆలోచనలన్నీ బిగబట్టి భద్రంగా దాచి ముప్ఫై ఏళ్ళ పైగా చదువులో మునిగి తేలి, ఇన్నాళ్లకు ఈ చదువిక అవ్వదని తెలుసుకుని, ఆ ఆలోచనలకి ఒక స్వేచ్ఛనిచ్చి మళ్ళీ పుస్తక రూపంలో బంధిస్తే వచ్చినవే ఈ కథలు.
మనసు మాతృభాషలోనే ఆలోచిస్తుంది. అందుకని తెలుగులో కాకుండా మరే భాషలోనూ నా ఆలోచనలని నిజాయితీగా రాయడం కుదరని పని. నిరంతర పోటీ పరిశ్రమలో బట్టీలు పట్టి వైద్యుడినైపోయిన నేను, ఎక్కడో ఏ మూలో నేను విన్న కథలు నాలో నన్ను అనే ఒకడ్ని సృష్టించి, ఆ భావం నిద్రాణమైపోకుండా నన్నెప్పుడూ మేల్కొల్పుతూ ఉండి చివరికి ఒక సృజనగా ఈ కథాసంపుటంగా ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. - నేనొక మానసిక వైద్యుడిని. ఎందరివో బాధలు, గాధలు వింటాను; అయినప్పటికీ ఈ కథల్లో వారెవరి వివరాలు గానీ, అనుభవాలు గానీ లేకుండా జాగ్రత్త తీసుకుని కేవలం నా అనుభవాలు లేదా పరిశీలనలు మాత్రమే రాశాను. ఈ కథలన్నీ కూర్చొని ఆలోచించి పథకం ప్రకారం రాసినవి కావు, అన్నీ ఆశువుగా ఒక సాయంత్రం సోఫాలో కూర్చునో, ఏ రైలు ప్రయాణంలో తూర్పుకనుమలు చూస్తూనో రాసేసినవి. కాబట్టి నిడివి, లోతు, కథావస్తువు మొదలైన వాటిల్లో తారతమ్యం ఉంటుంది..............