తెలుగు సాహిత్యంలో మంచన కవి రచించిన కేయూరబాహుచరిత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకపక్క ములాఘటిక కేతన రచించిన దశకుమారచరితం, మరోపక్క మంచన కేయూరబాహుచరిత్రం తెలుగులో కథాకావ్యరచనకు కొత్త పుంతకులు తొక్కించాయని చెప్పవచ్చు.
నన్నయ్య తిక్కన కవులకు మాత్రమే మంచనకవి ప్రస్తావించినందువల్ల ఇతడు తిక్కన - ఎర్రన కవుల నడిమికాలానికి చెందినవాడై ఉండవచ్చు. కవి గురించి, కాలం గురించి, కావ్యం గురించి, చారిత్రకంగా విశ్లేషిస్తూ విస్తృతమైన పీఠికను అందించారు సుప్రసిద్ధ పరిశోధకులు, సాహిత్యవేత్త డా.శ్రీరంగాచార్య. అందుకని ఆ విశేషాలను "సూర్యలోకనం" అనే పేరుతో వారు సంతరించిన పీఠికలో చదివి తెలుసుకోవలసినదిగా మా మనవి.