Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹40

               ఇది ఆధునిక తెలుగు సాహిత్యానికి ప్రజానిర్దేశం చేసిన శ్రీశ్రీ, శ్రీశ్రీ తరువాత తెలుగు పాఠకులను ఎంతో ప్రభావితం చేసి ఆరుద్రల జంట కవిత్వం. వీరు సాహిత్యరక్త బంధువులే కాకుండా మేనమామ, మేనల్లుళ్లుగా రక్తబంధువులు కావడం విశేషం. వివిధ సందర్భాల్లో వీరు ఒకరిపై ఒకరు వెలిబుచ్చిన అభిప్రాయాలు పాఠకుల కోసం ఇక్కడ ఇలా...

శ్రీశ్రీ గురించి ఆరుద్ర :

               ఆధునికుల ప్రశంసతో బాటు ఒకానొక నవ్యసాహిత్య పరిషత్తు వార్షికసభలో తన 'కవితా ఓకవితా!'గానంచేస్తూ అధ్యక్ష పీఠంపై నున్న విశ్వనాథ సత్యన్నారాయణగారిచేత కంట నీరు పెట్టించి, గాద్గదిక స్వరాన్ని పలికించి, కౌగలింప చేసుకున్న ఘనత ఒక్క శ్రీశ్రీ కే దక్కింది. పదిమంది కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకొంటున్నప్పుడు అందరిమధ్యా ఉంటూ తనలో తానుగా తపస్సు చేసుకొంటున్నట్టు అంతర్ముఖుడై ఆలోచించుకునే నిర్లిప్తత ఒక్క

               శ్రీశ్రీకే చెల్లుతుంది. అందరూ అంగీకరించిన నియమాల నేలవిడిచి,భయానకమైన నయాగరా జలపాతంపై నుండే వోమంలాంటి ఆశయాల ఆకాశంలో టెక్నిక్కుల ఉక్కుతీగెమీద ఈ కొస నుంచి ఆ కొసదాకా నడుస్తున్న సాహసం ఒక్క శ్రీ శ్రీకే కలుగుతుంది. అతడు సంప్రదాయాలు తెలిసిన విప్లవ కారుడు. తెలుగుతనం జీర్ణించుకున్న జగత్ పౌరుడు. ప్రబంధాల రొటీనులోంచి ప్రపంచపు నిజాలలోకి అప్పుడే అడుగుపెట్టి రాష్ట్రాభిమానం, దేశభక్తి నేర్చుకున్న తెలుగుకవితకు అంతర్జాతీయ దృక్పథాన్ని ప్రప్రథమంగా అతడే సులభ పాఠాలలో ప్రబోధించాడు. సాహి త్యానికి, సామ్యవాదానికి పెళ్ళిచేసిన పురోహితుడు. (-ఆరుద్ర, 'ఆంధ్రప్రభ' షీకీ (07-04-1962)