Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹60

ప్రపంచం పొట్టమీద సన్నని నూగు వెంట్రుక ఆ ఊరు! ఊరి వెలుపల.. ?

           ఉరి వెలుపల ఏముంటుంది?!

            శ్మశానం. కాకపోతే శ్మశానం లాంటి వీధి.

           వీధిలోని ఇళ్ళన్నీ శిథిలావస్థలో, గోడలు జారి పై కప్పుల్లేక కుర్రాళ్ళు కట్టి తిరగదోసిన పిచ్చిగ్గుళ్ళలా పిచ్చివాడి ఊహల్లా ఉన్నాయి. 

ఆ ఇళ్ళలో నివసిస్తున్న మనుషులు చరిత్ర కందనివాళ్ళు. సమాజానికి వెలుపలి వాళ్ళు, దగాపడ్డ వాళ్ళు. 

         అదుగో! అదే గుడిసెలో నుంటున్న సుబ్బడు గొడ్లు కోస్తాడు. చర్మాన్ని అమ్మేసి మిగిలిన మాంసాన్ని తిని బ్రతుకుతాడు. ఆ ఎదురింట్లో నుంటున్న గంగడు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తాడు. దొరికితే దెబ్బలు తింటాడు. ఆ పక్క గుడిసెలో నున్న వెంకడు; చింతకాయ లమ్ముకుంటాడు. ఒకసారి చింతకాయ లెరుతుండగా చెట్టు మీద నుండి జారిపడితే, కుడి కాలిరిగిపోయింది. 

                                                                                                   - అట్టాడ అప్పల్నాయుడు