Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

కాబోయే కథకులకి పనికొచ్చే చిట్కాలు

- ఆరుద్ర

“మనం చదివే చాలా కథలకన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి, అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్ళు ప్రచురించరేం?” అని మీ రెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్ళు నిలదొక్కుకోండి.

మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి.. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు, ఇప్పుడు పణం ఇస్తున్నారు.)

బాగా వుండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి.

“చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూవుంది. ఊఁ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచి కథలు వింటున్నాం. కూడబలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం, ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచి కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలని తహ తహ వున్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి.

భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరుల ఎల్ల విన్నంత, కన్నంత తెలియవచ్చినంత తేటపరిచారు. ఆహా! దొరికింది కిలకం. ఇది మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు ముందు బోలెడంత వినాలి. లాకాయి,.........